SP Balasubrahmanyam Health Update: నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు: ఎస్పీ చరణ్
SP Balasubrahmanyam Health Update: కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి..
SP Charan (File Photo)
SP Balasubrahmanyam Health Update: కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. అందులో ఒకరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు.. అయనకి కరోనా సోకి ఆగస్టు 05న కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా యావత్ సినీ లోకం కోరుకుంటుంది..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని అయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. 'ఇవాళ నాన్నకు ఫిజియోథెరపి నిర్వహించారు. నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. నాన్న ఆరోగ్యాన్ని మేరుగుపర్చడంలో ఎంజీఎం ఆస్పత్రి వర్ఘాలు, వైద్యులు కృషి అనిర్వచనీయం' అని ఎస్పీ చరణ్ తెలిపారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ అయన స్పష్టం చేశారు.