గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సోనూ సూద్

Sonu Sood Participates In Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

Update: 2020-09-29 05:34 GMT

Sonu Sood Participates In Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అందులో భాగంగానే సినీ నటుడు సోనూ సూద్ రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారు. టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తాను మొక్కలు నాటినట్లుగా సోనూ సూద్ వెల్లడించారు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ.. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచన చాలా గొప్పదని అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇందులో తానూ కూడా పాల్గోనందుకు ఆనందంగా ఉందని సోనూసూద్ వెల్లడించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా సోనూసూద్ కోరారు..

తన సినిమాల్లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.

Tags:    

Similar News