Sonu Sood Help : ఆ గ్రామానికి ఇంటర్నెట్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Sonu Sood Help : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో

Update: 2020-08-24 07:09 GMT

Sonu Sood help to mbbs student Marathmolya Swapnali

Sonu Sood Help : లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒకరు.. వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. ఇప్పుడు కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్‌.. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. నిజానికి సోనూసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరో... దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్‌ పేరే వినిపిస్తుంది.

సోనూసూద్ తాజాగా ఓ ఊరుకి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాడు.. మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్ధిని ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది. అయితే ఆ ఊళ్లో సిగ్నల్ రాకపోవడంతో ఆమె తన సోదరుడితో కలిసి 2 కి.మీ ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకొని అక్కడ చదువుకుంటుంది.. దీనిపైన ఓ మీడియా ప్రత్యేక కథనాలను వెల్లడించింది.. ఇది సోనూసూద్ దృష్టికి రావడంతో ఆ ఊరికి వైఫై సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చాడు.. దీనితో సోనూసూద్ పైన సోషల్ మీడియాలో ప్రశంస‌ల జల్లు కురుస్తుంది.

కరోనా కారణంగా పాఠశాలలు మరియు కళాశాలలు ఇప్పటికీ మూసివేయబడిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ లోనే ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి..అయితే, ఆన్‌లైన్ విద్య వల్ల మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకి కష్టంగా మారింది.. సరిగ్గా సిగ్నల్ అందక చాలా మంది విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు అందులో స్వాప్నిల్ అనే విద్యార్ధిని ఒకరు.. 



Tags:    

Similar News