మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్..ఈ సారి ఏం చేశారంటే..
Sonu Sood: కోవిడ్ మహమ్మారి కారణంగా కష్టపడుతున్న వారి కోసం నటుడు సోనూసూద్ తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
Sonu Sood Arranges Air Ambulance for Covid Patient
Sonu Sood: కోవిడ్ మహమ్మారి కారణంగా కష్టపడుతున్న వారి కోసం నటుడు సోనూసూద్ తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అవిశ్రాంతంగా నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ బారినపడ్డ రోగిని చికిత్స కోసం నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ విమానంలో పంపించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
కోవిడ్ కారణంగా ఓ అమ్మాయిని నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోనూసూద్ అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపారు. ECMO చికిత్స కోసం మొత్తం సెటప్ హైదరాబాద్ నుండి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి. దీంతో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో యువతికి చికిత్స అందించారు. ఆమె త్వరలో కోలుకొని తిరిగి వస్తుందన్నారు సోనూసూద్.