Sonali Bendre: ఆ నేత‌తో సోనాలికి సంబంధాలు.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన న‌టి

Sonali Bendre: సినిమా ఇండ‌స్ట్రీలో పుకార్లు స‌ర్వ‌సాధార‌ణం. మ‌రీ ముఖ్యంగా నటీమ‌ణుల విష‌యంలో ఇది ఎక్కువ‌గా ఉంటుంది. హీరోయిన్ల‌కు సంబంధించిన చిన్న వార్త‌యినా శ‌ర‌వేగంగా వైర‌ల్ అవుతుంది.

Update: 2025-06-08 08:30 GMT

Sonali Bendre: ఆ నేత‌తో సోనాలికి సంబంధాలు.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన న‌టి

Sonali Bendre: సినిమా ఇండ‌స్ట్రీలో పుకార్లు స‌ర్వ‌సాధార‌ణం. మ‌రీ ముఖ్యంగా నటీమ‌ణుల విష‌యంలో ఇది ఎక్కువ‌గా ఉంటుంది. హీరోయిన్ల‌కు సంబంధించిన చిన్న వార్త‌యినా శ‌ర‌వేగంగా వైర‌ల్ అవుతుంది. తాజాగా అల‌నాటి అందాల తార సోనాలి బింద్రే త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను తీవ్రంగా ఖండించింది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోతో, నటి సోనాలి బింద్రే పేరుతో సాగుతున్న ఊహాగానాలు ఆమెను బాధించాయి. మహారాష్ట్ర నేత రాజ్ ఠాక్రేతో తమ మధ్య అనుబంధం ఉందన్న ప్రచారంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ, అసత్యాలను ఖండించారు.

1996లో లెజెండరీ పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ భారతదేశానికి వచ్చిన సందర్భంలో, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ను స్వాగతించేందుకు రాజ్ ఠాక్రేతో పాటు సోనాలీ బింద్రే కూడా హాజరయ్యారు. అప్పటి ఫోటోలు, ఇటీవల ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను నెటిజన్లు కలిపి వైరల్ చేయడంతోనే ఈ గాసిప్ మొదలైంది.

తాజా ఇంటర్వ్యూలో సోనాలీ బింద్రే ఈ వ్యవహారంపై స్పందిస్తూ, "ఇలా ఎవరో సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఇది నిజంగా చాలా బాధాకరం. ప్రజలు తప్పుడు అర్థాలు వెతికేస్తున్నారన్న విషయం నిరాశ కలిగిస్తుంది" అని చెప్పారు.

సోనాలి ఈ విష‌య‌మై వివరణ ఇస్తూ.. “రాజ్ ఠాక్రే సతీమణి షర్మిలా ఠాక్రే, ఆమె తల్లి మా పిన్ని స్నేహితులు. మా రెండు కుటుంబాల మధ్య చాలా కాలం నాటి స్నేహం ఉంది. చిన్నప్పటినుంచే ఆ పరిచయం కొనసాగుతోంది. దాన్ని వ్యక్తిగతంగా మార్చి ప్రచారం చేయడం బాధాకరం” అని పేర్కొన్నారు.

ఇక పోలిటికల్ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు సోనాలి బింద్రే క్లారిటీ ఇచ్చారు – “నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆ రంగంలోకి రావాలంటే ధైర్యం కావాలి. విమర్శల్ని తట్టుకోగలగాలి. నాకు అలాంటి ధైర్యం లేదు. నేను నా పనిపట్లనే దృష్టి పెడతాను” అని చెప్పారు.

Tags:    

Similar News