సోషల్ మీడియా..సామాన్యులకు వినోదం..సెలబ్రిటీలకు ఆదాయం !

Social media and its uses for various people: కరోనాతో దేశం స్థంభించిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రంగాల వారు అంతా ఇళ్లకు పరిమితమైపోయారు.

Update: 2020-08-13 06:26 GMT

Social media and its uses for various people: కరోనాతో దేశం స్థంభించిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రంగాల వారు అంతా ఇళ్లకు పరిమితమైపోయారు. ఇక సినీ పెద్దలు కూడా లాక్‌ డౌన్‌లో భాగమయ్యారు. సినిమా షూటింగ్ లకు బ్రేక్‌ పడింది. రిలీజ్‌ లు ఆగిపోయాయి. మరి మన స్టార్స్ ఏం చేస్తున్నారు? ఖాళీగా ఇంట్లో ఉంటూ టైమ్ పాస్ చేస్తూనే డబ్బులు సంపాదిస్తున్నారు.

సామాన్యులు సోషల్‌ మీడియాను టైం పాస్‌కోసం ఉపయోగిస్తారు. కాలక్షేపం కోసం ఫేస్‌ బుక్‌, ట్వీట్టర్‌ వాడుతుంటారు. యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ హంగామా చేస్తారు. మరి మన సినిమా స్టార్స్‌ వీటితో తమ అభిమానులతో టచ్‌లో ఉంటూ సినిమా అప్డేట్‌ ఇస్తుంటారు. కరోనా టైంలో బయటకు వెళ్ళకుండా ఇంట్లో నే ఉంటున్న మన స్టార్స్ సోషల్ మీడియాలలో హంగామా చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్‌లల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఏ ఇష్యూ ఉన్న దాని గురించి సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు. వాళ్ల పెట్టిన పోస్టులకు లక్షల వ్యూస్‌, కామెంట్స్‌ వస్తుంటాయి.

సినీ స్టార్స్‌కు సోషల్‌ మీడియా వల్ల టైం పాస్‌తో పాటు, డబ్బులు కూడా వస్తున్నాయి. సోషల్‌ మీడియా సామాన్యులకు టైం పాస్ అయితే సెలబ్రీటలకు ఆదాయ మార్గం అయ్యింది. ఈ కరోనా టైమ్‌లో మన స్టార్స్ కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకున్నారు‌. ఇక రామ్‌గోపాల్‌ వర్మ వరస సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు రిలిజ్‌ చేసి అందరిని షాక్‌కి గురిచేశాడు.



Tags:    

Similar News