OTT: ఓటీటీలోకి ‘సార్‌ మేడమ్‌’.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుందో తెలుసా?

విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మేనన్‌ (Nithya Menen) జంటగా నటించిన తాజా చిత్రం తలైవా తలైవి తెలుగులో సార్‌ మేడమ్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో వినోదం పంచేందుకు సిద్ధమైంది.

Update: 2025-08-15 12:45 GMT

OTT: ఓటీటీలోకి ‘సార్‌ మేడమ్‌’.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుందో తెలుసా?

విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మేనన్‌ (Nithya Menen) జంటగా నటించిన తాజా చిత్రం తలైవా తలైవి తెలుగులో సార్‌ మేడమ్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో వినోదం పంచేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించింది. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగిబాబు, రోషిని హరిప్రియన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కథ ఏమిటంటే…

ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) ఓ నిపుణుడైన పరోటా మాస్టర్‌. సొంత ఊరిలో కుటుంబంతో కలిసి హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి పక్క ఊర్లో రాణి (నిత్యా మేనన్‌) అనే అమ్మాయితో సంబంధం చూస్తారు. పెళ్లి చూపుల్లోనే ఆమెపై మనసు మాయమైన వీరయ్యపై, మొదట ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరిస్తాయి. కానీ తర్వాత రెండు కుటుంబాల నేపథ్యాలపై తెలిసిన నిజాల వల్ల ఈ సంబంధాన్ని రద్దు చేస్తారు. అప్పటికే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య, రాణి పెద్దలను కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు.

కొత్తగా మొదలైన వారి దాంపత్య జీవితం మొదట సాఫీగా సాగినా, కొంత కాలానికే విభేదాలు మొదలవుతాయి. అవి క్రమంగా ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తాయి. చివరికి విడాకుల దాకా వెళ్లిన వీరిద్దరి జీవితం తర్వాత ఏ మలుపు తీసుకుంది? వారి మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? మళ్లీ ఒక్కటయ్యారా? అనేది సినిమాలో చూడాల్సిందే.

Tags:    

Similar News