నెట్ఫ్లిక్స్ లో రికార్డులు సృష్టిస్తున్న "శ్యామ్ సింగరాయ్''

Shyam Singha Roy: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన "శ్యామ్ సింగరాయి" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

Update: 2022-01-27 09:30 GMT

నెట్ఫ్లిక్స్ లో రికార్డులు సృష్టిస్తున్న "శ్యామ్ సింగరాయ్''

Shyam Singha Roy: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన "శ్యామ్ సింగరాయ్" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి "టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల అయింది. మొదటి రోజునుండి మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా.

థియేటర్ లలో ఉన్నప్పుడు చాలా సార్లు హౌస్ ఫుల్ బోర్డ్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం లో కూడా అదే జోరు కనబరుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 21 నుండి "శ్యామ్ సింగరాయ్" చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా సినిమా గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకుంది. జనవరి 17 నుండి 23 దాకా సినిమా 3,590,000 వ్యూయింగ్ హౌర్స్ నమోదు చేసుకుని నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా చూసిన మూడవ సినిమా గా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి దాకా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 జాబితా లో తన పేరు లిఖించిన ఇండియన్ సినిమా గా మారింది "శ్యామ్ సింగరాయ్".

Tags:    

Similar News