నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్న "శ్యామ్ సింగరాయి".. ముహూర్తం సిద్ధం

Shyam Singha Roy: న్యాచురల్ స్టార్ నాని తన "శ్యామ్ సింగరాయి" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు...

Update: 2021-12-30 10:10 GMT

నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్న "శ్యామ్ సింగరాయి".. ముహూర్తం సిద్ధం

Shyam Singha Roy: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని తన "శ్యామ్ సింగరాయి" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తన కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటించారు.

"టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల అయింది. మొదటి రోజునుండి మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. ముఖ్యంగా శ్యామ్ సింగరాయి పాత్రలో నాని నటన అద్భుతం అని క్రిట్రిక్స్ సైతం కొనియాడుతున్నారు.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి 4వ వారం నుంచి "శ్యామ్ సింగరాయ్" చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అయితే ఇంకా సినిమాకి విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమా నెట్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News