తమన్నాను పెళ్లి చేసుకుంటా : శృతిహాసన్‌

Update: 2019-03-15 07:26 GMT

అసలు ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు దాదాపు అందరు స్టార్ హీరోయిన్లు ఇతర హీరోయిన్లతో చక్కగా స్నేహంగానే మెలుగుతున్నారు. అయితే అందరిలోనూ శృతి హాసన్ మరియు తమన్నా ల స్నేహం మాత్రం రోజురోజుకీ శృతి మించిపోతూ వస్తోంది. ఇద్దరూ ఒకళ్ళతో ఒకరు ప్రేమగా మెలుగుతున్నారు. మొన్నటికి మొన్న అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్న తమన్నా, శృతి హాసన్ ఒకరినొకరు కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజిలో హల్ చల్ చేసింది.

ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో శృతి చేసిన కామెంట్లు మరొకసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. "మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్ ని పెళ్లాడతారు?" అని ఒక మీడియా ఇంటర్వ్యూలో శృతిని ప్రశ్నిస్తే, ఆమె "ఇంకెవరు? తమన్నాని పెళ్లాడేస్తాను. తనంటే నాకు అంత ఇష్టం. చాలా మంచిది. అస్సలు వదిలి పెట్టేదానిని కాదు" అంటూ చెప్పుకొచ్చింది శృతి. ఈ హంగామా చూసి అసలు శృతి, తమన్నా ల మధ్య ఉంది స్నేహం మాత్రమేనా అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వరుస సినిమాలతో తమన్నా, పెర్సనల్ లైఫ్, మ్యూజిక్ తో శృతి హాసన్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.

Similar News