Shefali Jariwala: ‘కాంటా లగా’ గర్ల్ షెఫాలి జరివాలా గుండెపోటుతో కన్నుమూత
Shefali Jariwala Passes Away: షెఫాలీ మృతివార్తతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, సహ నటీనటులు, అభిమానులు ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Shefali Jariwala: ‘కాంటా లగా’ గర్ల్ షెఫాలి జరివాలా గుండెపోటుతో కన్నుమూత
Shefali Jariwala Passes Away: బాలీవుడ్‌లో ‘కాంటా లగా’ పాటతో వెలుగులోకి వచ్చిన నటి షెఫాలి జరివాలా అనర్థవశాత్తు గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయస్సు 42 సంవత్సరాలు. ముంబైలోని అంధేరి లోఖండ్‌వాలాలో నివసిస్తున్న షెఫాలి, శుక్రవారం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి తక్షణమే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం కూపర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
షెఫాలీ మృతివార్తతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, సహ నటీనటులు, అభిమానులు ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క పాటతో దేశం మొత్తం గుర్తుపట్టిన నటి
షెఫాలీ 2002లో విడుదలైన ‘కాంటా లగా’ రీమిక్స్ పాటతో అప్‌రాజిత ఫేమ్‌ను అందుకున్నది. ఈ పాటను ముఝ్‌సే షాదీ కరోగి చిత్రంలోనూ ఉపయోగించారు. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న షెఫాలీకి “కాంటా లగా గర్ల్” అనే పేరే పక్కాగా స్థిరమైంది. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 13లో కూడా ఆమె పోటీదారుగా పాల్గొన్నారు. హిందీ సినిమాలలో ముఝ్‌సే షాదీ కరోగి తర్వాత ఎలాంటి చిత్రాల్లో నటించలేదు గానీ, కన్నడలో హుడుగారు అనే సినిమాలో నటించింది.
తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న షెఫాలీ.. యవ్వనంలోనే గుండెపోటుతో కన్నుమోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రముఖ గాయకుడు మికా సింగ్ షెఫాలీ మృతిపై తీవ్రంగా స్పందించారు.