మోహన్‌బాబుకు సుప్రీంలో ఊరట: జరల్నిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్
Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మోహన్‌బాబుకు సుప్రీంలో ఊరట: జరల్నిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్
Mohan Babu: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు సుప్రీంకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2024 డిసెంబర్ 10న హైదరాబాద్ జల్ పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. బాధిత జర్నలిస్ట్ పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పహాడిషరీఫ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో ఆయన ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ తనపై దాడి జరిగిందని పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఫిర్యాదుకు కౌంటర్ గా మోహన్ బాబు కూడా మనోజ్ పై ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ లో జల్ పల్లిలోని నివాసం వద్ద మనోజ్ తనపై దాడి జరిగిందని మీడియాకు, పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతానని గేటు లోపలి నుంచి చెప్పారు. మనోజ్ కోసం గేటు వెలుపల మీడియా ప్రతినిధులు వేచి చూస్తున్నారు. అదే సమయంలో మోహన్ బాబు బయటకు వచ్చారు.ఈ విషయమై ప్రశ్నించిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడికి దిగారు.