Santhana Praptirasthu: భార్య కోసం మామతో యుద్ధం..హీరో గెలిచాడా? లేక సంతాన ప్రాప్తిరస్తు అని దీవించుకున్నాడా?
Santhana Praptirasthu: ఓటీటీలో ఏదైనా మంచి సినిమా చూద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయకుండా మీ వాచ్‌లిస్ట్‌లో ఒక సినిమాను చేర్చేయండి.
Santhana Praptirasthu: భార్య కోసం మామతో యుద్ధం..హీరో గెలిచాడా? లేక సంతాన ప్రాప్తిరస్తు అని దీవించుకున్నాడా?
Santhana Praptirasthu: ఓటీటీలో ఏదైనా మంచి సినిమా చూద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయకుండా మీ వాచ్‌లిస్ట్‌లో ఒక సినిమాను చేర్చేయండి. అదే సంతాన ప్రాప్తిరస్తు. ఫ్యామిలీ మొత్తం కలిసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుకుంటూ చూడగలిగే పక్కా తెలుగు సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెండింటిలోనూ స్ట్రీమ్ అవుతూ ఇప్పటికే 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మన ఇంట్లో జరిగే గొడవే
మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే చిన్న చిన్న ఆప్యాయతలు, గొడవలను డైరెక్టర్ చాలా సహజంగా చూపించారు. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఎంత సరదాగా ఉంటారో, అలాగే అత్తమామలతో ఉండే బంధాలు ఎలా ఉంటాయో ఇందులో చూడొచ్చు. అయితే, కథలో అసలు ట్విస్ట్ ఎక్కడంటే.. తనను, తన భార్యను ఎవరూ విడదీయలేరని మామగారితో హీరో ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఆ సవాల్‌లో గెలవాలంటే వీరికి పిల్లలు పుట్టాలి. కానీ మన హీరోకి పిల్లలు పుట్టడమే పెద్ద సమస్యగా మారుతుంది. సమాజంలో ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్యను బేస్ చేసుకుని ఈ కథను రూపొందించారు.
నవ్వులు పూయిస్తూనే ఆలోచింపజేసేలా
పిల్లలు కలగడం లేదన్న పాయింట్ వినడానికి సీరియస్ గా ఉన్నా, సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. హీరో ఆ సమస్య నుంచి బయటపడటానికి, ఛాలెంజ్ గెలవడానికి పడే తిప్పలు చూస్తుంటే కడుపుబ్బ నవ్వు వస్తుంది. కామెడీతో పాటు గుండెకు హత్తుకునే ఎమోషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ చాలా నేచురల్ గా, మన ఇంట్లో మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి. నేటి కాలంలో జీవనశైలి మార్పుల వల్ల సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో.. దాన్ని అవమానంగా కాకుండా బాధ్యతగా ఎలా చూడాలనే ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమా ఇస్తుంది.
ఎందుకు చూడాలి?
ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అడల్ట్ కామెడీ, హింస ఎక్కువగా ఉంటున్నాయి. కానీ సంతాన ప్రాప్తిరస్తు పక్కా క్లీన్ మూవీ. ఇంట్లో అమ్మ, నాన్న, పిల్లలతో కలిసి సరదాగా కూర్చుని చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా జనాలు ఎంతగా నచ్చుతుందో. సో, మన నేటివిటీ ఉన్న ఒక స్వచ్ఛమైన తెలుగు ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వకండి.