Samantha: మాజీ భర్తకు ఝలక్... సమంత ఆ టాటూ రిమూవ్ చేసిందా?

Samantha: ప్రముఖ నటి సమంత నిర్మాతగానే కాకుండా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Update: 2025-06-07 08:07 GMT

Samantha: మాజీ భర్తకు ఝలక్... సమంత ఆ టాటూ రిమూవ్ చేసిందా?

Samantha: ప్రముఖ నటి సమంత నిర్మాతగానే కాకుండా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సీక్రెట్ ఆల్కెమిస్ట్ సంస్థ ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం ఆమె ఒక స్పెషల్ వీడియోను షేర్ చేశారు. నథింగ్ టు హైడ్ అని పేర్కొంటూ ఇందులో ఆమె నవ్వుతూ కనిపించారు. ఇదొక మంచి ఉద్దేశ్యంతో మొదలైంది అనే క్యాప్షన్ తో జత చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె మెడపై టాటూ కనిపించకపోవడంపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. వైఎంసీ టాటూను సమంత తొలగించేశారా అనే సందేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగి ఉండకపోవచ్చని..మేకప్ తో అది కనిపించకుండా కవర్ చేసి ఉండవచ్చని మరికొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సమంత కథనాయికగా ఎంట్రీ ఇచ్చిన చిత్రమే ఏమాయ చేసావే. గౌతమ్ వాసుదేవ్ మేన్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం సామ్ ను సినీప్రియులకు ఎంతగానో చేరువ చేసింది. తొలిచిత్రానికి గుర్తుగా సమంత తన మెడపై వైఎంసీ అనే పచ్చబొట్టును వేయించుకుంది. ఇది తనకెంతో ప్రత్యేకమని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సీక్రెట్ ఆల్కెమిస్ట్ విషయానికి వస్తే ఇదొక బ్యూటీ, కాస్మెటిక్, పర్సనల్ కేర్ సంస్థ. ఈ సంస్థకు ఈమె సహ వ్యవస్థాపకురాలు. దీంతో ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ సామ్ తరచూ వీడియోలు షేర్ చేస్తుంటారు. 

Tags:    

Similar News