Samantha: అది చాలా బాధాకరం అంటున్నారు సమంత

Samantha: బ్లాక్ బెర్రీ గురించి వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Update: 2022-01-09 15:00 GMT

 బ్లాక్ బెర్రీ గురించి వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Samantha Instagram Post: సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన గురించి తన సినిమాల గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉండే సమంత తాజాగా ఇప్పుడు పెట్టిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న బ్లాక్ బెర్రీ ఫోన్ లు ఇకపై కనుమరుగు కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ వారు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు. మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో 14 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ మొబైల్ గురించి తెలియని వారు ఉండరు.

బ్లాక్బెర్రీ వారు జనవరి 4 నుంచి తమ ఆపరేటింగ్ సిస్టం బ్లాక్ బెర్రీ ఓ ఎస్ మరియు బ్లాక్ బెర్రీ ప్లే బుక్ ఓఎస్ సేవలను నిలిపి ఇకపై వారి ఫోన్ లలో ఓ ఎస్ 7.1 బీబీ ఫోన్ కాల్స్, మెసేజెస్, ఎమర్జెన్సీ నెంబర్లు కూడా పనిచేయవు. దీంతో బ్లాక్ బెర్రీ అభిమానులకు నిరాశకు గురయ్యారు. అందులో బ్యూటీ సమంత కూడా ఒకరని చెప్పవచ్చు. బ్లాక్బెర్రీ గురించిన వార్త ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ "ఎందుకో తెలియట్లేదు కానీ ఇది చాలా బాధగా ఉంది" అంటూ కామెంట్ చేశారు సమంత. ఇక ఈ మధ్య "పుష్ప" సినిమాలో తన ఐటమ్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన సమంత ఇప్పుడు "శాకుంతలం" మరియు "యశోద" సినిమాలతో బిజీగా ఉంది.

Tags:    

Similar News