Vijay Devarakonda - Samantha: క్రేజీ ప్రాజెక్ట్‌.. విజయ్‌ దేవరకొండతో సమంత..

Vijay Devarakonda - Samantha: "నిన్ను కోరి" సినిమాతో డైరెక్టర్ గా మారిన శివ నిర్వాణ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్...

Update: 2022-03-05 09:15 GMT

Vijay Devarakonda - Samantha: విజయ్ దేవరకొండ తో మళ్లీ రొమాన్స్ చేయబోతున్న సమంత

Vijay Devarakonda - Samantha: "నిన్ను కోరి" సినిమాతో డైరెక్టర్ గా మారిన శివ నిర్వాణ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత "మజిలీ" సినిమా తో మరొక సూపర్ హిట్ ని అందుకున్న శివ నిర్వాణ తాజాగా నాని హీరోగా "టక్ జగదీష్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ ఇప్పుడు యువ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన "మజిలీ" సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు మళ్లీ ఈ డైరెక్టర్ తో చేతులు కలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సామ్.

మరోవైపు విజయ్ దేవరకొండ మరియు సమంత "మహానటి" సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. ఆ సినిమాలో వారిద్దరి లవ్ ట్రాక్ బాగానే హిట్ అయింది. ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ మరియు సమంత ఒక లవ్ స్టోరీ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News