Samantha - Taapsee: తాప్సీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సమంత

Samantha - Taapsee: బాలీవుడ్ ఎంట్రీ కోసం తాప్సీ తో చేతులు కలిపిన సమంత

Update: 2021-11-02 09:42 GMT

తాప్సీతో కలసి చేతులు కలుపనున్న సమంత (ఇమేజ్ ఇండియా టుడే)

Samantha - Taapsee: ఈ మధ్యనే నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు తన మొత్తం ఫోకస్ కెరీర్ పైనే పెట్టింది. హీరోయిన్ గా వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ బిజీగా మారిపోయింది సమంత. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది ఈ స్టార్ బ్యూటీ. తాజా సమాచారం ప్రకారం సమంత బాలీవుడ్లో సైతం అడుగుపెట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న ఈ సినిమాని నిర్మిస్తున్నది మరెవరో కాదు స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తాప్సి ఈ మధ్యనే అవుట్ సైడర్ ఫిలిమ్స్ అనే పేరుతో స్వయంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది.

బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించుకున్న తాప్సి సమంత ని కూడా సంప్రదించగా "ఓ బేబీ" బ్యూటీ కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ఒప్పుకుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన బయటకు రాబోతోంది. అంతే కాకుండా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, నటీనటులు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ సినిమాని తాప్సీ కేవలం నిర్మిస్తుందా లేక సినిమాలో కీలక పాత్రలో కూడా కనిపిస్తుందా అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News