ఒక్క ఐటమ్ పాట తో కెరీర్ లో బిజీగా మారిన స్టార్ బ్యూటీ...

Samantha: "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ కెరీర్ లో ఊపందుకున్న సమంత

Update: 2021-12-26 03:15 GMT

ఒక్క ఐటమ్ పాట తో కెరీర్ లో బిజీగా మారిన స్టార్ బ్యూటీ...

Samantha: స్టార్ బ్యూటీ సమంత తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ కోసం ఐటమ్ సాంగ్ చేసింది. "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ అల్లు అర్జున్ తో సమానంగా తన స్టెప్పులతో అదరగొట్టింది సమంత. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాట మాత్రమే కాక సమంత ఎక్స్పోజింగ్ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే సమంత అభిమానులు కూడా ఈ పాట పై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆమె స్కిన్షో ఏ మాత్రం బాగా లేదంటూ సమంతా పై ఫైర్ అవుతున్నారు అభిమానులు. అయితే మరికొందరు మాత్రం ఈ పాట తో మరింత పెరిగిందని స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు అందరూ సమంత ని తమ సినిమాల కోసం ఎంపిక చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ మధ్యనే "ది ఫ్యామిలీ మ్యాన్" సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీ కే కూడా తదుపరి ప్రాజెక్ట్ కోసం కూడా సమంత నేనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎన్టీఆర్ సరసన కూడా కొరటాల శివ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొందరు హీరోలు కూడా సమంత ను రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ పక్కన పెడితే ఐటమ్ సాంగ్ తో సమంత కెరీర్ జోరందుకుంది అని చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News