NTR Birthday: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న 'ఆర్ఆర్ఆర్' టీం!

Jr NTR Birthday: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం).

Update: 2021-05-19 12:49 GMT
ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ (ఫొటో ట్విట్టర్)

Jr NTR Birthday: స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం). ఈ సినిమాలో కోమరం భీంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం అభిమానులకు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి ఓ కొత్త అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తాజాగా చిత్ర యూనిట్‌ ట్విట్టర్లో పేర్కొంది.

రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే దయచేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ అంతా రేపు ఇళ్లలోనే ఉండండి. బయటకు వచ్చి బర్త్‌ డే వేడుకలు నిర్వహించొద్దు' అంటూ ఈ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఈ విషయమై ఎన్టీఆర్‌ కూడా ఈ రోజు ఉదయం అభిమానుల కోసం ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా కాలంలో తన పుట్టిన రోజులు వేడుకలు చేపట్టవద్దని అందులో పేర్కొన్నాడు. కాగా, మే 10న ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న ఎన్టీఆర్‌.. ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపాడు.


Tags:    

Similar News