RRR Movie Update: పూర్తైన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్

RRR Movie Update: * సెలెబ్రేషన్స్ చేసుకున్న ట్రిపుల్‌ ఆర్‌ మూవీ చిత్ర యూనిట్‌ * కేక్‌ కట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి

Update: 2021-08-19 05:47 GMT

పూర్తైన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్

RRR Movie Update: 'ఆర్ఆర్ఆర్' టీం సెలబ్రేషన్స్‌కి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న చివరి షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీం అంతా కలిసి సెలెబ్రేషన్స్‌ చేసుకున్నారు. కేక్‌ కట్‌ చేసి హంగామా చేశారు. ఇప్పుడా పిక్స్ సోషల్‌ మీడియాలోకి ఎక్కేసి తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ పిక్స్ చూసి చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. 

త్వరలో ట్రిపుల్‌ ఆర్ మూవీ రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాం చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ సీత పాత్రలో కనిపించనుంది. ఇక హాలీవుడ్ న‌టి ఒలివియా ఎన్టీఆర్ స‌ర‌స‌న‌ న‌టిస్తోంది. శ్రియా శ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ్ గ‌ణ్ కీల‌క పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News