RRR Oscar: ఆస్కార్ బరిలో దిగనున్న "ఆర్ఆర్ఆర్"

RRR Oscar: "బాహుబలి" సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా "ఆర్.ఆర్.ఆర్".

Update: 2022-06-22 08:00 GMT

RRR Oscar: ఆస్కార్ బరిలో దిగనున్న "ఆర్ఆర్ఆర్"

RRR Oscar: "బాహుబలి" సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా "ఆర్.ఆర్.ఆర్". అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు కలెక్షన్స్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదలైన ఈ చిత్ర తెలుగు, తమిళ్, మలయాళం, మరియు కన్నడ వెర్షన్లు జి 5 లో స్ట్రీమ్ అవుతుండగా హిందీ వెర్షన్ మాత్రం డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా "ఆర్ఆర్ఆర్" సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.

సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 95 అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో "ఆర్ ఆర్ ఆర్" సినిమాను నామినేట్ చేయాలని భారతీయ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక నామినేషన్స్ తోపాటు ఆస్కార్ కూడా గెలుచుకునే అర్హత ఈ సినిమాకి ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు. 95 వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి లో లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆస్కార్ కు నామినేట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News