RRR Mega Teaser: 'ఆర్ఆర్ఆర్' మెగా టీజర్ ఎప్పుడంటే..

RRR Mega Teaser: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" పలు కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Update: 2021-03-25 13:27 GMT

రాంచరణ్ (ఫొటో ట్విట్టర్)

RRR Mega Teaser: ప్రముఖ సౌత్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" పలు కారణాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే కొన్ని పోస్టర్లు, క్యారెక్టర్ టీజర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఈ సినిమాకు సంబంధించి మెగా టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ టీం ప్రకటించింది.

భారీ తారాగణంతో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 13 న పది భాషలలో విడుదల కానుందని సమాచారం. వీటిలో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, భోజ్‌పురి, హిందీ, సింహళీస్ మరికొన్ని భాషలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ మరికొందరు ప్రముఖ నటులున్నారు.

కాగా, రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) న మెగా టీజర్ ను విడుదల చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు టీం టీజర్ కోసం పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే చెర్రీ ఒక్కడినే చూపిస్తారా..? లేదా మరికొంతమంది నటులతో టీజర్ రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. కానీ ప్రస్తుతం షూటింగ్ పక్కా ప్రణాళికలతో సాగుతోందని, చాలా వరకు సినిమా షూట్ చేశారని సమాచారం. మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవ్‌గన్.. తమ తదుపరి షెడ్యూల్‌ లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కోమరం భీమ్.. రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రల షూటింగ్ చేసి, అప్పుడప్పుడు మోషన్ పోస్టర్లను బయటకు వదిలారు. అయితే రామ్ చరణ్ బర్త్‌డే సంర్భంగా మెగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News