Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో చోరీకి యత్నం.. గోడ దూకి గాయపడ్డ దొంగ
Mahesh Babu: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో చోరీకి యత్నం.. గోడ దూకి గాయపడ్డ దొంగ
Mahesh Babu: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు కృష్ణ, మహేష్ సహా కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి ఉన్నారు. అయితే అంతకు ఓ రోజు ముందు ఓ వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించినట్లు వార్తలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ దొంగ పేరు కృష్ణ. అతడి వయసు 30. మూడు రోజుల క్రితమే ఇతను ఒడిశా నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఓ నర్సరీ వద్ద ఉంటోన్న ఇతడు.. రాత్రికి రాత్రే సంపన్నుడు అవ్వాలన్న ఉద్దేశంతో, మహేశ్ బాబు ఇంటికి కన్నం వేయాలని ప్రయత్నించాడు.
అనుకున్నట్టే గోడ ఎక్కి దూకాడు కానీ అది బాగా ఎత్తుగా ఉండడంతో కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. పెద్ద శబ్దం రావడంతో మహేష్ బాబు ఇంట్లో సెక్యూరిటీ గార్డులు శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక వ్యక్తి గాయాలతో పడి ఉండటంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన, సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని విచారించి హాస్పిటల్ కి తరలించారు.