RGV: ఆర్జీవీ డాగ్ లవర్స్‌పై సెటైర్లు..
సుప్రీంకోర్టు తాజాగా ఢిల్లీలోని వీధికుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ తీర్పుతో డాగ్ లవర్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్, సదా వంటి వారు కూడా భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.

ఆర్జీవీ మాట్లాడుతూ – “మీరు నిజంగానే కుక్కలంటే అంత ప్రేమ ఉంటే, వీధుల్లో ఉన్న పేదలను మీ ఇంట్లో ఉంచుకోండి. కుక్కలను వీధుల్లో వదిలేయండి. కుక్కలను ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారా? అయితే వాటినే పెళ్లి చేసుకోండి. మీకు అనారోగ్యం వస్తే హాస్పిటల్‌కి కాకుండా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్లండి” అని సెటైర్లు వేశారు.
అదికాకుండా – “మీరు పెంచుతున్న బ్రీడ్ కుక్కలను కూడా బయట వదిలేయండి. అవి ఎలా బతుకుతాయో మీకే తెలుస్తుంది. మీ పిల్లలను వీధికుక్కలతో ఆడుకోనివ్వండి. మీరు అంటున్నట్టే కుక్కలకు హక్కులు ఉంటే, వాటికోసం స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టించండి. మీ పిల్లలకు బోన్లు ఇచ్చి తినిపించండి. దేవుడి స్థానంలో కుక్కలను పూజించండి” అంటూ వరుసగా సాటైర్లు పేల్చాడు.