Pawan Kalyan: మోడీని కలిసిన అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..
Pawan Kalyan: ఎమ్మెల్యేగా పవన్ గెలిచినప్పటి నుంచి తండ్రితోపాటే ఉంటున్నారు పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్.
Pawan Kalyan: మోడీని కలిసిన అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..
Pawan Kalyan: ఎమ్మెల్యేగా పవన్ గెలిచినప్పటి నుంచి తండ్రితోపాటే ఉంటున్నారు పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్. అతడిని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నారు పవన్. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంట్లో కనిపించిన అకీరా.. ఆ తర్వాత నాన్నతోపాటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా వెన్నంటే అకీరాను తీసుకెళ్తున్నాడు.
ఇక గురువారం సాయంత్రం ప్రధాని మోడీని కుటుంబసమేతంగా కలిశాడు పవన్ కళ్యాణ్. భార్య అన్నా లెజేనోవా, కొడుకు అకీరాతో కలిసి ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి హాజరయ్యారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం మోడీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా ప్రధాని మోడీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోడీ మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక అకీరా మోడీని కలవడంపై రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు ఎంతో ఆనందంగా ఉందని.. చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు. నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోడీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోడీ గారిని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అని రాసుకొచ్చారు.