Ravi Teja: హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా: 'మాస్ జాతర' సహా రవితేజ వరుస ప్రాజెక్టులు!

Ravi Teja: మాస్‌ మహారాజ రవితేజ హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 'మాస్‌ జాతర' త్వరలో రిలీజ్‌ కానుంది.

Update: 2025-10-30 12:02 GMT

Ravi Teja: మాస్‌ మహారాజ రవితేజ హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 'మాస్‌ జాతర' త్వరలో రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. యంగ్‌ హీరోలకు సైతం లేని లైనప్‌ మాస్ రాజా సొంతం.

టాలీవుడ్‌లో రవితేజ అంటే మాస్‌ ఇమేజ్‌కు మారుపేరు. హిట్స్‌, ఫ్లాప్స్‌ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో 'మాస్‌ జాతర' ప్రీమియర్స్‌తో రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్‌ చేశానని, ఈ చిత్రంతో హిట్‌ ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సాంగ్స్‌, ట్రైలర్‌ అంచనాలు పెంచాయి.

ఈ చిత్రం చేస్తూనే కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా స్వీకరించాడు. తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో 'మజిలీ' తరహా చిత్రం ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్‌ శంకర్‌ కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. త్రినాథరావు నక్కిన బృందం నుంచి బెజవాడ ప్రసన్న కథ రెడీ చేశాడు. రవితేజను కలిసి పాయింట్‌ చెప్పగా ఫుల్‌ స్క్రిప్ట్‌ రాయమని సూచించాడు. కెరీర్‌లో 80వ చిత్రంగా వసిష్ఠ దర్శకత్వంలో సినిమా రానుంది. ప్రస్తుతం డిస్కషన్‌ దశలో ఉంది. ఇలా ఆరు ప్రాజెక్టులతో రవితేజ లైనప్‌ యంగ్‌ హీరోలను మించిపోయింది.

Tags:    

Similar News