మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి మాస్ మహారాజ.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి...
Ravi Teja Multiplex: టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నటుల్లో మాస్ మహారాజ రవితేజ ఒకరు.
Ravi Teja Multiplex: టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నటుల్లో మాస్ మహారాజ రవితేజ ఒకరు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరో తన క్రేజ్‌తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరబాద్‌లో ఆయన పేరిట మల్టీప్లెక్స్‌లను ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏషియన్ రవితేజ అనే పేరుతో హైదరబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ థియేటర్ రన్ అవ్వనుంది.
తాజాగా ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. అందులో రవితేజ కుమార్తె మోక్షద పాల్గొన్నారు. ART సినిమాస్ పూజా కార్యక్రమంలో మోక్షద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ అభిమాన హీరో కుమార్తెను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ కూడా పాల్గొనడం విశేషం. మొత్తం ఆరు స్క్రీన్స్‌తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో గ్రాండ్‌గా ఓపెన్ కాబోతుంది. ఇప్పటికే మహేష్ బాబు (AMB), అల్లు అర్జున్ (AAA), విజయ్ దేవరకొండ (AVD) వంటి స్టార్స్‌తో సంయుక్తంగా ఏషియన్ గ్రూప్స్ భారీ మల్టీఫ్లెక్స్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రవితేజ (ART) చేరిపోయాడు.