Chiranjeevi Box Office Stamina: చిరు సినిమా ప్లాపైనా...175 రోజులు గ్యారెంటీ...దట్‌ఈజ్‌ మెగాస్టార్‌ స్టామినా

Chiranjeevi Box Office Stamina: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో "బాక్సాఫీస్" అనే పదానికి అసలైన అర్థాన్ని నేర్పిన నటుడు చిరంజీవి.

Update: 2026-04-11 05:17 GMT

Chiranjeevi Box Office Stamina

Chiranjeevi Box Office Stamina: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో "బాక్సాఫీస్" అనే పదానికి అసలైన అర్థాన్ని నేర్పిన నటుడు చిరంజీవి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం వినోదం, కానీ చిరంజీవి రాకతో అది ఒక సామాజిక ఉద్వేగంగా, పంపిణీదారుల పాలిట కల్పవృక్షంగా మారింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వందల రోజులు ప్రదర్శితమయ్యే చిరు చిత్రాల వెనుక ఉన్న ఆ మాయాజాలం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సినిమా రిజల్ట్ ఏదైనా.. థియేటర్లు మాత్రం కళకళ

ఒకప్పుడు టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో ఉండేది. నవయుగ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్ వంటి సంస్థలు సినిమా నిర్మాణం నుంచి నటీనటుల ఎంపిక వరకు ప్రభావం చూపేవి. నిర్మాతలు కూడా వారి నిర్ణయాలకే లోబడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చిరంజీవి హీరోగా ఎదిగిన తర్వాత ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

చిరంజీవి ఒక వ్యక్తి కాదు… ఒక శక్తి. ఆయన సినిమాలు విడుదల అంటేనే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏర్పడటానికి ఆయన సినిమాలే కారణమయ్యాయని సినీ విశ్లేషకులు చెబుతారు. ముఖ్యంగా కాకినాడ వంటి కేంద్రాల్లో ఆయన సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కనీసం 100 రోజులు ఆడటం సాధారణ విషయం అయ్యింది.

‘మృగరాజు’ వంటి ప్లాప్ సినిమా కూడా 100 రోజులు ఆడటం, ‘మాస్టర్’ సినిమా 175 రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగడం వంటివి అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్‌ను తెలియజేస్తున్నాయి. ఒకే సెంటర్‌లో మెయిన్ థియేటర్ నిండిపోయి, పక్కన మినీ థియేటర్లలో అదనపు షోలు వేసినా క్షణాల్లో హౌస్‌ఫుల్ కావడం అప్పట్లో సాధారణ దృశ్యం. చిరంజీవి తన సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చేవి. ఆయన పారితోషికం కంటే 5 నుండి 6 రెట్లు ఎక్కువగా వారికి ఆదాయం వచ్చేదని అప్పటి సినీ ప్రముఖులు చెప్పేవారు. ఇది ఆయన మార్కెట్ శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది.

జిల్లా పంపిణీ వ్యవస్థకు శ్రీకారం

పూర్వం సినిమాలు కేవలం ఆంధ్రా, సీడెడ్, నైజాం అనే పెద్ద ఏరియాల వారీగా అమ్ముడయ్యేవి. కానీ చిరంజీవి క్రేజ్ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ జిల్లాల వారీగా విడిపోయింది. చిరు స్టామినాను అంచనావేసిన అల్లు అరవింద్‌ 1987లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పడిన ఈ డిస్ట్రిబ్యూషన్‌ 1991లో రౌడీ అల్లుడు సినిమాతో నైజాంలో పాగా వేశారు. ఇప్పుడు ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా చూసుకుంటే, తెలుగు సినీ చరిత్ర పుటల్లో "చిరు" విప్లవం ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకం. ఒక హీరో స్టామినా అంటే కేవలం కలెక్షన్లు కాదు, ప్లాప్ లో కూడా పంపిణీదారులను గట్టెక్కించే ధైర్యం అని నిరూపించాడు చిరంజీవి.

Tags:    

Similar News