Ravanasura Movie: శరవేగంగా జరుగుతున్న "రావణాసుర" షూటింగ్

Ravanasura Movie: జోరుగా సాగుతున్న రవితేజ సినిమా షూటింగ్

Update: 2022-02-13 16:30 GMT

శరవేగంగా జరుగుతున్న "రావణాసుర" షూటింగ్

Ravanasura Movie: వరుస డిజాస్టర్ లు అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు "క్రాక్" సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు "ఖిలాడి" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు రవితేజ. "రాక్షసుడు" సినిమా తో సూపర్ హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 11న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈమె మొదటి రోజు కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

మరోవైపు "క్రాక్" సినిమా హిట్ అయిన జోరులో వరుస సినిమాలు సైన్ చేశాడు రవితేజ. దర్శకుడు సుధీర్ వర్మతో రవితేజ సినిమా అనౌన్సమెంట్ ఇప్పటికే విడుదల అయింది. ఈ మధ్య చిత్ర షూటింగ్ ని స్టార్ట్ అయింది. షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 2 న షూటింగ్ ని మొదలు పెట్టగా, ఈ ఇవాళ్టికీ రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసేసుకున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు తెలిపారు. అదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం కూడా ఒక పోస్టర్ ని వదిలింది. సుశాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనపించబోతున్నారు. సినిమాని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News