విజయ్ దేవరకొండని ప్రేమిస్తున్నట్లు అంగీకరించిన రష్మిక..
విజయ్ దేవరకొండని ప్రేమిస్తున్నట్లు అంగీకరించిన రష్మిక..
విజయ్ దేవరకొండని ప్రేమిస్తున్నట్లు అంగీకరించిన రష్మిక..
Rashmika Mandanna: "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మీక మందన్న ఆ తర్వాత "గీత గోవిందం" సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించింది. ఆ సినిమాతో రష్మిక కెరియర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఆ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత "డియర్ కామ్రేడ్" సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించడంతో ఆ ఊహగానాలు మరింత ఉపందుకున్నాయి.
గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అని పుకార్లు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని కప్పిపుచ్చేసే రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. గతంలో రిషబ్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకున్న రష్మిక తరువాత అతనితో బ్రేకప్ చేసుకుంది. ఆ సమయంలో విజయ్ దేవరకొండ తనకి ఒక అండగా నిలబడ్డాడని చెప్పింది రష్మిక.
అప్పటినుంచి వారిద్దరి మధ్య స్నేహం చాలా బలపడిందని, ఎంత స్నేహంగా ఉన్నా తన మనసు మాత్రం ఎప్పుడు విజయ్ దేవరకొండ చాలా స్పెషల్ అని చెబుతూ ఉండేదని అన్న రష్మిక ఒకానొక సమయంలో తన ప్రేమను విజయ్ దేవరకొండ కి చెప్పిందట. మొదట్లో కొంచెం ఆలోచించినా తర్వాత విజయ్ కూడా రష్మిక పట్ల ఉన్న ప్రేమను అంగీకరించాడని ఇప్పుడు తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది ఈ భామ. "నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా విజయ్ దేవరకొండ ఇన్ సెక్యూర్ కాదు. తన ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉంటాడు," అని షాకింగ్ కామెంట్లు కూడా చేసింది.