Ramayana: 'రణబీర్, సాయి పల్లవి రామాయణ సినిమాకు ఓపెన్ హైమర్ స్థాయి గుర్తింపే టార్గెట్'

Ramayana: రామాయణ సినిమాకు ఆస్కార్ వస్తోందని ఆ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ధీమాగా చెబుతున్నారు.

Update: 2025-03-01 07:59 GMT

Ramayana: రామాయణ సినిమాకు ఆస్కార్ వస్తోందని ఆ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ధీమాగా చెబుతున్నారు. 2026 దీపావళి నాటికి ఈ సినిమా మొదటి భాగం విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక రెండో భాగాన్ని 2027లో విడుదల చేయనున్నారు.2024 నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్ కు వచ్చినంత గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆయన పంచుకున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు అవార్డు రావడం మనపైనే ఆధారపడి ఉంటుందని నమిత్ చెప్పారు. ఏ స్థాయిలో ప్రచారం చేశామనేది ముఖ్యమని...ఎలా ప్రచారం చేశామనేది ముఖ్యమని ఆయన అన్నారు. ఈ సినిమాతో భారతీయ కథకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని నమిత్ చెప్పారు.

ఈ సినిమా నిర్మాతల్లో తాను కూడా ఒకడిగా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ సినిమాతో చరిత్ర సృష్టిస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్నారు.హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్, కైకేయి పాత్రను లారా దత్తా, మందనగా షీబా చద్దా, లక్ష్మణుడి పాత్రను రవి దూబే పోషిస్తున్నారు. దశరథుడి పాత్రలో అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. కౌసల్యగా ఇంద్ర కృష్ణణ్, సూర్పనఖ పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

నమిత్ ఏడు ఆస్కార్ అవార్డులను పొందారు. ఇంటర్‌స్టెల్లార్ , డూన్ వంటి చిత్రాల్లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్‌ల కోసం ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ వ్యవస్థాపకుడు. బాలీవుడ్ చలనచిత్ర నిర్మాత నరేష్ మల్హోత్రా పెద్ద కొడుకే నమిత్. అతను ముంబైలో పెరిగాడు. అక్కడే జసుద్‌బెన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్ గ్రాడ్యుయేట్. సోనీ,జీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కోల్‌గేట్ టాప్ 10 వంటి అనేక టెలివిజన్ షోలు సీరియల్‌ల కోసం ఆయన గతంలో పని చేశారు.

Tags:    

Similar News