RGV Tweet: పవన్ కళ్యాణ్‌కు రాంగోపాల్‌వర్మ వరుస ట్వీట్స్
RGV Tweet: పాన్ ఇండియాలో పవన్‌కల్యాణ్ పవర్ చూపించాలి
పవన్ కళ్యాణ్‌కు రాంగోపాల్‌వర్మ వరుస ట్వీట్స్
RGV Tweet: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానయాక్‌ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్నారు. ఇటీవల విడుదలైన పుష్ప బీటౌన్‌లో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని.. కాబట్టి.. భీమ్లానాయక్‌ని సైతం పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నారు. పుష్ప సినిమానే అంత కలెక్ట్ చేస్తే పవర్ స్టార్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి..? పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్‌కి ఆన్సర్ చెయ్యలేమన్నారు. ఆర్జీవీ. అల్లు అర్జన్ గురించి నా ట్వీట్స్ అన్నీ వోడ్కా టైం లో పెట్టాను కానీ ఇప్పుడు పెట్టిన ట్వీట్స్ కాఫీ టైంలో పెడుతున్నానని వరుస ట్వీట్స్ చేశారు.
పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
… @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022