RGV: పవన్‌కల్యాణ్‌ తనను, తన పార్టీని గెలిపించనందుకు.. ఓటర్లను నిందిస్తున్నారు అంటూ ఆర్‌జీవీ ట్వీట్‌

RGV: పవన్‌కల్యాణ్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసిన ఆర్‌జీవీ

Update: 2023-05-15 04:18 GMT

RGV: పవన్‌కల్యాణ్‌ తనను, తన పార్టీని గెలిపించనందుకు.. ఓటర్లను నిందిస్తున్నారు అంటూ ఆర్‌జీవీ ట్వీట్‌

RGV: పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ రామ్ గోపాల్‌వర్మ ట్వీట్ చేశారు. సినిమా ఫెయిల్ అయితే, ప్రేక్షకులను నిందించే నిర్మాతలా తన పార్టీని గెలిపించనందుకు ఓటర్లను నిందిస్తున్నారంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. పవన్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవల తన పార్టీ ఓటమి గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. టీడీపి, బీజేపీ తో పొత్తులు ఉంటాయని కానీ తాను సీఎం అభ్యర్థిని కాదన్నారు. గత ఎన్నికల్లో జనసేన 130 సీట్లలో పోటీ చేస్తే కేవలం ఒక్క సీటునే గెలిపించారన్నారు. అలాంటిది సీఎం అభ్యర్థిత్వాన్ని ఎలా డిమాండ్ చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకునే ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే ఆర్టీవీ ట్వీట్ పై పవన్ అభిమానులు మండి పడుతున్నారు.

Tags:    

Similar News