Ram Gopal Varma: సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు

*సినిమా ఆపడం అనేది బ్యాడ్‌ థింగ్‌- ఆర్జీవీ

Update: 2022-07-20 09:55 GMT

Ram Gopal Varma: సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు 

Ram Gopal Varma: లడికి సినిమా రిలీజ్ కాకుండా కొంతమంది సంతకాలతో ఆపుతున్నారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సినిమాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవికుమార్ రెడ్డి అనే వ్యక్తితోపాటు శేఖర్ రాజు, మరొక ఇద్దరు పైన ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. అలాగే లడికి సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారంటూ.. పూర్తి వివరాలను తెలియజేస్తూ వర్మ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

"లడికి సినిమా స్క్రీనింగ్ ఆపు చేయాలి అని ఇద్దరు దొంగ కాగితాలతో అబద్ధపు స్టేట్మెంట్లతో ఫోర్జరీ సంతకాలతో కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చారు. కానీ కోర్టులో ఆ ఇద్దరి స్టేలని కొట్టివేసి నా లడికి ( అమ్మాయి ) సినిమాకి క్లియరెన్స్ ఇచ్చారు. నా సినిమాని ఇబ్బంది పెట్టాలని చూసిన వారిపై చట్టరీత్యా అనేక సెక్షన్ల కింద చర్య తీసుకోబోతున్నాను. నా కంపెనీ లెటర్ హెడ్ ని ఫోర్జరీ చేసిన ఎన్.రవి కుమార్ రెడ్డి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు ఫైల్ చేయడమే కాకుండా రన్నింగ్ లో ఉన్న నా సినిమాను ఆపినందుకు పరువు నష్టం, నాకు జరిగిన నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా వసూలు చేస్తాను. నేనే కాకుండా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆస్ట్రీ ( Artsee media ) మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ కూడా ఆ ఇద్దరి మీద కేసులు పెట్టబోతున్నారు. ఇక శేఖర్ రాజ్ అనే వ్యక్తి కోర్టులో అబద్ధపు స్టేట్మెంట్లతో కోర్టు వారిని మభ్య పెట్టిన విషయంలో అదే కోర్టులో ఫోర్జరీ నేరం కింద కంప్లైంట్ నమోదు చేయబోతున్నాము". అని ప్రెస్ నోట్‏లో పేర్కొన్నారు.

ఇటీవల ఆర్జీవీ దర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో లడికి అనే సినిమా వచ్చింది. తెలుగులో అమ్మాయిగా రిలీజ్ అయింది. బ్రూస్లీ నేపథ్యంలో తీయడంతో చైనాలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఆర్జీవీ లడికి సినిమాని ఆపాలంటూ శేఖర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసి స్టే తెచ్చుకున్నాడు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

Tags:    

Similar News