Rakul Preet Singh: చిన్న సహాయమైనా గొప్ప ఫలితాన్నిస్తుంది: రకుల్
Rakul Preet Singh: కోవిడ్ రోగులకు సహాయం చేసేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రకటించింది.
రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటో ట్విట్టర్)
Rakul Preet Singh: దేశంలో కోవిడ్ రోగులకు సహాయం చేసేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఎవరికి వీలైనంత వారు సహాయం చేయాలని పిలుపునిచ్చింది. వచ్చిన నిధులతో లైఫ్ సేవింగ్ పరికరాలతో పాటు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ సరఫరా, రీఫిల్లింగ్ లాంటివి చేయనున్నట్లు తెలిపింది.
"ప్రస్తుతం మన దేశం కోవిడ్ కేసులతో చాలా భయంకరంగా తయారైంది. ఈ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆక్సిజన్, బెడ్స్, మందులు మరెన్నో కొరతల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం. అందుకే గివ్ ఇండియా పేరుతో ఈ నిధుల సమీకరణ కార్యక్రమం చేపట్టాం. మా లక్ష్యం కింది స్థాయిలో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చేయడం, అలాగే లైఫ్ సేవింగ్ పరికాలను అందించడం" అని పేర్కొన్నారు.
చేసే చిన్న సహాయమైనా.. కోవిడ్ పేషెంట్స్‌కు చాలా ఉపయోగపడుతుందని వెల్లడించింది. "మీరిచ్చే రూ .100 లైనా ప్రజలకు ఉపయోగపడుతుంది. మేం ఎలాంటి సహాయాన్నానైనా స్వాగతిస్తాం. ఈ మా ప్రయత్నంలో ప్రతీ ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలని కోరుతున్నాం" అని వెల్లడించింది.