Rakul Preet Singh: ఆ టైంలో నా భర్తను చాలా మిస్ అవుతుంటా.. అందుకే అలా చేస్తా రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించారు. కెరటం సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన రకుల్ ఆ తర్వాత వెంకట్రాది ఎక్స్ ప్రెస్ లో నటించారు.
ఆ టైంలో నా భర్తను చాలా మిస్ అవుతుంటా.. అందుకే అలా చేస్తా రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించారు. కెరటం సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన రకుల్ ఆ తర్వాత వెంకట్రాది ఎక్స్ ప్రెస్ లో నటించారు. అలా కెరీర్ స్టార్ చేసిన రకుల్ స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు. సినిమాలు చేస్తున్న క్రమంలో జాకీ భగ్నానీ వివాహం చేసుకుని ముంబైకి మకాం మార్చేశారు. షూటింగ్ సమయంలో తన భర్తను చాలా మిస్ అవుతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు రకుల్. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
గతేడాది ఫిబ్రవరి 21న జాకీని రకుల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో మా ఆయనను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అతనికి దగ్గరగా ఉన్న ఫీల్ రావడం కోసం ఆయన బట్టలు వేసుకుంటున్నా. అప్పుడు నాకు ఆయన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఓ సెల్ఫీ ఫొటోను పంచుకున్నారు రకుల్. అందులో ఆమె జేబీ అనే పేరుతో భర్త పేరును సూచించే హుడి ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక రకుల్ మాటలపై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ కోసం తప్పదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
రకుల్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పారు. స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మార్చారు. అక్కడ కూడా వరస అవకాశాలు అందుకుని నటించారు రకుల్. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయారు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక మేరే హస్బెండ్ కి బీవీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాలున్నాయి.