రజనీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ విడుదల

* రజనీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది -వైద్యులు * నిన్నటితో పోల్చుకుంటే కొంత కోలుకున్నారు -వైద్యులు * బీపీలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి -వైద్యులు * సాయంత్రం కల్లా డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటాం -వైద్యులు

Update: 2020-12-26 06:17 GMT

 తీవ్ర అస్వస్థతతో నిన్న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలోలో అడ్మిట్‌ అయిన రజనీకాంత్‌కు రెండోరోజు చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది వైద్య బృందం. ప్రస్తుతం ఆయనకు కార్డియాలజీ, న్యూరాలజీ డిపార్ట్‌మెంట్‌ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. రజనీ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

అస్వస్థతతో హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు.. రజినీకాంత్ ను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.

నిన్న బీపీలో హెచ్చుతగ్గులతో అస్వస్థతకు గురైన రజనీకాంత్‌కు.. సాయంత్రం వరకు బీపీ కంట్రోల్‌ కాలేదు. దాంతో బీపీని అదుపులోకి తెచ్చేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇవాళ ఆయనకు మరిన్ని పరీక్షలు జరపనున్నారు డాక్టర్లు. రజనీకాంత్ కు తోడుగా ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ లోనే ఉండగా.. ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదు వైద్యులు.

ఇక రజనీ త్వరగా కోలుకోవాలని కమల్ హాసన్ ఆకాంక్షించారు. మోహన్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలోలో చికిత్స పొందుతున్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి జాయింట్‌ ఎండీ సంగీత వెల్లడించారు. రజనీకి అవసరమైన వైద్యం అందిస్తున్నామన్నారు. సాయంత్రం మరోసారి పరీక్షలు అనంతరం డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సంగీత.

Tags:    

Similar News