ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కాబోతున్న "అన్నాతే"

Annaatthe Movie - Rajinikanth: గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ పొందనున్న రజినీకాంత్ సినిమా

Update: 2021-11-02 10:30 GMT

ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల కానున్న అన్నాతె 

Rajinikanth - Annaatthe Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "అన్నాతే". శివ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ లభించనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కేవలం అమెరికా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు యూ కే లో ఈ సినిమా ఒక 1100 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటిదాకా ఏ తమిళ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ ఓపెనింగ్స్ లభించలేదు.

ఇందులో కేవలం అమెరికాలోనే ఐదు వందల కంటే ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది ఈ సినిమా. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ అయిన పానాసోనిక్ ఐమాక్స్ థియేటర్ సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ లో ఉంది. అందులో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

న్యూజిలాండ్ లో 10 కెనడాలో 14, మలేషియాలో 100, మిడిల్ ఈస్ట్ లో 80, సింగపూర్ లో 20, శ్రీలంకలో 50 మరియు యు.కె లో 30 థియేటర్లలో "అన్నాతే" సినిమా విడుదల కాబోతోంది. ఖుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సతీష్, బాలా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న దీపావళి సందర్భంగా విడుదల కాబోతోంది.

Tags:    

Similar News