Nani: రాజారాణి సినిమాని రిజెక్ట్ చేసిన నాని

* నాని అందుకే ఆ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడా

Update: 2021-09-09 15:15 GMT

నాని (ఫైల్ ఫోటో)

Nani : ఈ మధ్యనే "వీ" సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాని తాజాగా ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. నాని తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా సినిమాలు మాత్రమే కాక డిజాస్టర్ లు కూడా చవిచూశాడు. అష్టా చమ్మా సినిమా నుంచి వీ సినిమా దాకా నాని చాలా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు.

అయితే నాని రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అందులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. రాజా రాణి మరియు ఎఫ్ 2 సినిమా లలో ముందుగా నాని ఏ నటించాల్సి ఉంది. ఆ చిత్ర దర్శక చిత్రాల దర్శక నిర్మాతలు ముందుగా హీరో పాత్ర కోసం నానినే సంప్రదించారు. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల నాని ఆ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా నిర్మాత దిల్ రాజు అయితే సంతోషంగానే ఉన్నారని నాని అన్నారు.

Tags:    

Similar News