Rajamouli: ప్రియాంకను ఓకే చేయడానికి అసలు కారణం అదా.. రాజమౌళి ప్లాన్ అదిరింది
రాజమౌళి సినిమా తీస్తున్నారంటే చాలు అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. సినిమా కథ ఏంటి, హీరో, హీరోయిన్లు ఎవరు, ఎంత బడ్జెట్‌లో తీస్తున్నారు.
ప్రియాంకను ఓకే చేయడానికి అసలు కారణం అదా.. రాజమౌళి ప్లాన్ అదిరింది
Rajamouli: రాజమౌళి సినిమా తీస్తున్నారంటే చాలు అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. సినిమా కథ ఏంటి, హీరో, హీరోయిన్లు ఎవరు, ఎంత బడ్జెట్‌లో తీస్తున్నారు. ఎక్కడ షూట్ చేస్తారు వంటి విషయాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు. మహేష్‌తో సినిమా అన్నప్పటి నుంచి అభిమానులు సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు రానివ్వడంలేదు. సినిమాలో నటించబోయే హీరోయిన్ల గురించి రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. అయితే ప్రియాంక ఇటీవల హైదరాబాద్ రావడంతో ఎట్టకేలకు ఆమె ఒకే అయినట్టు తెలిసింది. ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
SMB29 మూవీ వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇంకా అసలు పేరు పెట్టలేదు. అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాను తీసుకోవడంపై రాజమౌళి పెద్ద ప్లానే వేశారని టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు. దీనిని రాజమౌళి టీమ్ ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేసినట్టు సమాచారం. నాటునాటు పాటకు ఆస్కార్ రావడం కోసం ప్రియాంక చాలానే కష్టపడ్డారని తెలుస్తోంది. ఆస్కార్ కోసం ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని సమాచారం.
SSMB29లో ప్రియాంకను తీసుకోవడానికి అసలు కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆమె ఏజెన్సీ అంత కష్టపడితే.. స్వయంగా తను నటించిన సినిమా అయితే ఈజీగా పుష్ చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. సినిమా ఆస్కార్‌కు వెళ్లడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకుంటున్నారు. దానికి తోడు ప్రియాంక చోప్రాకు ప్రస్తుతం హాలీవుడ్‌లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో SSMB29కి కూడా క్రేజ్ తీసుకువస్తుందని భావిస్తున్నారు. అందుకే రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో ప్రియాంకను భాగం చేశారని టాక్.
ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. ఇదే నిజమైతే SSMB29 సినిమాకు కూడా ఆస్కార్ రావడం కష్టమేమీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మహేష్, ప్రియాంక చోప్రా, అబ్రహం షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ షూటింగ్ పూర్తయ్యాక అమెజాన్ అడవుల్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. మరి రాజమౌళి ఎన్నో కలలతో తీస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.