Rajamouli: ప్రభుదేవా పాటకు రాజమౌళి దంపతుల డ్యాన్స్.. రిహార్సల్స్ వీడియో వైరల్
Rajamouli: వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిన రాజమౌళి దంపతులు
Rajamouli: ప్రముఖ దిగ్గజ దర్శకుడు రాజమౌళి, తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఆ వీడియో ప్రముఖంగా దర్శనమిస్తోంది. ఓ వైపు వర్క్ చేస్తూనే ఫ్యామిలీ టైమ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారని ఆయనకు మంచి పేరు ఉంది. షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికినా.. కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో చేసిన డ్యాన్స్ వీడియో బయటకు వచ్చింది.
దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో తాజాగా బయటకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి తన సతీమణి రమతో డ్యాన్స్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజమౌళి-రమ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.