Purushothamudu Movie OTT: అప్పుడేనా.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాజ్ తరుణ్ కొత్త సినిమా
Purushothamudu Movie OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా ఆగస్టు 23వ తేదీ నుంచి పురుషోత్తముడు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Purushothamudu Movie OTT
Purushothamudu Movie OTT: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. థియేటర్లలో సినిమా ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాతే ఓటీటీలోకి అనే నిబంధనను పాటిస్తున్నాయి. అయితే కొన్ని థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేని మూవీలు మాత్రం వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
ఈ క్రమంలోనేగా తాజాగా ఓ మూవీ ఓటీటీలోకి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో వచ్చిన కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో రానుంది. ఆ సినిమా మరేదో కాదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన 'పురుషోత్తముడు'. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జులై 26వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.
దీంతో ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా ఆగస్టు 23వ తేదీ నుంచి పురుషోత్తముడు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. కాగా పురుషోత్తముడు మూవీ కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు, అచ్చంగా మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్‌తో రావడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.