Raghava Lawrence: మరోసారి గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. పేద రైతుకు ట్రాక్టర్‌ను..

Raghava Lawrence: సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు.

Update: 2024-05-08 06:10 GMT

Raghava Lawrence: మరోసారి గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. పేద రైతుకు ట్రాక్టర్‌ను..

Raghava Lawrence: సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఒక సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుంటారు లారెన్స్. అందుకే తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మాత్రం అనే అనే ఫౌండేష్‌ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్‌ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్‌ను తానే స్వయంగా అందించారు.

దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం విల్లుపురం జిల్లాలోని ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్‌ తాళాలు అందజేశానని అందులో తెలిపారు లారెన్స్. ‘మీ ప్రేమ, అభిమానాలను చూస్తుంటే.. నాకు మరింత శక్తిని ఇస్తున్నాయి.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోంది. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం’ అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు రాఘవ లారెన్స్. 


Tags:    

Similar News