నాని సినిమాకి అంత బడ్జెటా?

Nani: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

Update: 2022-06-09 15:00 GMT

నాని సినిమాకి అంత బడ్జెటా?

Nani: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల బడ్జెట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. హీరోల పై ఉండే నమ్మకంతో నిర్మాతలు కూడా ఒక సినిమా కోసం చాలా కోట్ల వరకు బడ్జెట్ ను వెచ్చిస్తున్నారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని తదుపరి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాని నటించిన "అంటే సుందరానికి" సినిమా జూన్ 10వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా తర్వాత నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా కి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణలో జరిగే దసరా పండుగ నేపథ్యంలో ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తెలంగాణలో దసరా హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. సినిమాకి అదే హైలైట్గా మారబోతోందట.

అయితే ఇలాంటి ఒక పక్క నాటు సినిమా కోసం నిర్మాతలు 60 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నారు అని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే చిత్రనిర్మాతలు ఉన్నానని మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నాని మార్కెట్ పరంగా ఇప్పటిదాకా తన కెరియర్లో 40 నుంచి 50 కోట్ల వరకే ఈ సినిమా బడ్జెట్ ను నిర్ణయించారు నిర్మాతలు. కానీ ఇప్పుడు దసరా సినిమాతో 60 కోట్లు ఎందుకు అని కొందరు నిలదీస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు కలెక్షన్లు అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News