స్వప్న దత్ లేకపోయుంటే "సీతారామం" సినిమా మరోలా ఉండేదేమో

Sita Ramam: అసలు ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్ల వద్దకు వస్తారా లేదా అనే సందేహాలు వస్తున్నప్పటికీ...

Update: 2022-08-08 11:11 GMT

స్వప్న దత్ లేకపోయుంటే "సీతారామం" సినిమా మరోలా ఉండేదేమో

Sita Ramam: అసలు ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్ల వద్దకు వస్తారా లేదా అనే సందేహాలు వస్తున్నప్పటికీ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన "సీతారామం" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ని స్వప్న దత్ నిర్మించారు. ఒక క్లాసిక్ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ 20 కోట్లు మాత్రమేనని కానీ డైరెక్టర్ హను రాఘవపూడి ప్రతి డీటెయిల్ కు ప్రాధాన్యతను ఇచ్చి విభిన్న ప్రదేశాలలో షూటింగ్ చేయడంతో బడ్జెట్ 35 కోట్ల కంటే ఎక్కువ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బడ్జెట్ పెరిగిపోతున్నా సరే స్వప్న దత్ హను రాఘవపూడి విజన్ మీద ఉన్న నమ్మకంతో దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒకవేళ స్వప్న స్థానంలో మరొక నిర్మాత ఉండి ఉంటే షూటింగ్ ను తక్కువ ప్రదేశాల్లో తక్కువ సమయంలో పూర్తి చేయమని ప్రెషర్ చేసేవారని అప్పుడు సినిమా అవుట్ పుట్ కూడా చాలా మామూలుగా ఉండేదని చెప్పుకోవచ్చు. గతంలో లై మరియు పడి పడి లేచే మనసు సినిమాలకి భారీగా ఖర్చుపెట్టినందుకు ట్రోలింగ్ ఎదుర్కొన్న హను రాఘవపూడి ఎట్టకేలకు "సీతారామం" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో వైజయంతి మూవీస్ వారు హను రాఘవపూడి దర్శకత్వంలో మరి కొన్ని సినిమాలు కూడా నిర్మించేందుకు రెడీ అని చెబుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News