SSMB 29: రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ భామ ఎవరో తెలుసా..!

SSMB 29: రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతున్న SSMB 29 లో ప్రియాంక చోప్రా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2024-12-28 07:20 GMT

SSMB 29: రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ భామ ఎవరో తెలుసా..!

SSMB 29: రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతున్న SSMB 29 లో ప్రియాంక చోప్రా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం. మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఛాన్స్ కొట్టేసినట్టు ఇండస్ట్రీ టాక్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు, నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు. తొలి షెడ్యూల్ వాటిలోనే జరగనున్నట్టు సమాచారం. ఆ తర్వాత విదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. మహేష్ బాబు పక్కన ఇండోనేషియా హీరోయిన్ చెలిసా ఎలిజబెత్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రియాంక చోప్రా వచ్చి చేరింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి అనేక ఆఫర్లు వచ్చినా సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఏడేళ్లుగా కేవలం ఇంగ్లీష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా.. రాజమౌళి-మహేష్ బాబు సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే మహేష్ పక్కన హీరోయిన్ గా చేయడానికి ఇంతమంది హీరోయిన్లు ఉండగా 42 ఏళ్ల ప్రియాంక చోప్రాని జక్కన్న సెలెక్ట్ చేయడానికి పెద్ద కారణమే ఉందంట.

ప్రియాంక చోప్రాకి హాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి హాలీవుడ్ ఫ్యాన్స్‌ని కూడా థియేటర్లకు రప్పించేందుకు ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారని సమాచారం. రాజమౌళికి విదేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ప్రియాంక లాంటి హీరోయిన్ అయితే ఇంకా క్రేజీగా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా ఈ సినిమా ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌కి కూడా భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట రాజమౌళి.. ప్రియాంక చోప్రా కేవలం గ్లామర్, యాక్టింగ్‌తోనే కాకుండా యాక్షన్ సీన్స్‌లో కూడా బాగా చేయగలరు. అందుకే ప్రియాంకను అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది.

సినిమాలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా దాదాపు కన్మార్మ్ అయినట్టు సమాచారం. త్వరలో ఇతర నటీనటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్రబృందం చెబుతోంది. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News