Prakash Raj: 'చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటి పవన్ కల్యాణ్?'
Pawan Vs Prakash Raj: ప్రకాష్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.
Prakash Raj: 'చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటి పవన్ కల్యాణ్?'
Pawan Vs Prakash Raj: ప్రకాష్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. తిరుపతి లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో తన వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీశాయి.
చేయని తప్పునకు సారీ చెప్పించుకొని ఆనందమా?
తిరుపతి లడ్డు వివాదంపై సినీ నటులు కార్తి స్పందించారు. తన సినిమా ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. లడ్డూ అంశం సున్నితమైంది.. అని ఆయన నవ్వుతూ చెప్పారు. పవిత్రమైన ఇలాంటి విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ కార్తినుద్దేశించి వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కార్తి స్పందించారు. ఉద్దేశ్యపూర్వకంగా తాను మాట్లాడలేదని.. ఇలా మాట్లాడినందుకు క్షమించాలని సోషల్ మీడియాలో కార్తి పవన్ కళ్యాణ్ ను కోరారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా బదులిచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అర్ధమైందని ఆయన పవన్ కళ్యాణ్ కూడా బదులిచ్చారు.
దీంతో ఈ వివాదం ముగిసింది. అయితే చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేమిటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవేననే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
షూటింగ్ నుంచి వచ్చి అన్నీ చెబుతానన్న ప్రకాశ్ రాజ్
తిరుపతి లడ్డూ వివాదంపై సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ పోస్టు పెట్టారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఇది జరిగింది. దీన్ని జాతీయస్థాయి అంశం చేయడం సరైంది కాదు.. దోషులను శిక్షించాలని కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మీరంటే గౌరవం ఉంది. కానీ, తప్పు జరిగిందని తెలిసి స్పందించకపోతే ఎలా అని ఆయన అడిగారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటరిచ్చారు. తన ట్వీట్ ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్ధం చేసుకున్నారు... తన ట్వీట్ ను మరోసారి చదువుకోవాలని సూచించారు. తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని... ఇండియాకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాశ్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆయన వదలడం లేదు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ALSO READ: #JustAsking ‘పవన్ కల్యాణ్... ఉన్న గొడవలు చాలు, పెద్దది చేయకు’ - ప్రకాశ్ రాజ్