MAA Elections: మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ మెసేజ్
MAA Elections: మా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ తన రాజీనామాను ఆమోదించాలంటూ మంచు విష్ణును కోరారు.
MAA Elections: మంచు విష్ణుకు ప్రకాశ్‌రాజ్ మెసేజ్
MAA Elections: మా అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ తన రాజీనామాను ఆమోదించాలంటూ మంచు విష్ణును కోరారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన తాను రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మెసేజ్ పంపారు. ప్రకాశ్ రాజ్ మెసేజ్‌కు స్పందించిన మంచు విష్ణు, రాజీనామా నిర్ణయం ఏ మాత్రం సంతోషంగా లేదని తెలిపారు. సక్సెస్ లు ఫెయిల్యూర్ లు సహజమంటూ మీ సలహాలు సూచనలు మా అసోసియేషన్‌కు అవసరమన్నారు.
అంతకుముందు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్ అతిథిగా వచ్చాను అతిథిగానే ఉంటానన్నారు. మా తో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజీనామా మాత్రమే చేశానని తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తానని స్పష్టం చేశారు. ఎలా ఓడిపోయాం ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదని ఎలక్షన్స్ ఎలక్షన్స్ లాగే జరిగాయని తెలిపారు.