Prabhas, Samantha: సమంతకు పోటీగా ప్రభాస్ సినిమా..!

Prabhas, Samantha: స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "యశోద" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Update: 2022-11-07 15:30 GMT

Prabhas, Samantha: సమంతకు పోటీగా ప్రభాస్ సినిమా..!

Prabhas, Samantha: స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు "యశోద" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో సమంత గర్భవతిగా కనిపించనుంది. సరోగసీ కాన్సెప్ట్ తో తరికెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఆ రోజున మరొక సూపర్ హిట్ సినిమా కూడా విడుదల కాబోతోంది అదే ప్రభాస్ "వర్షం" సినిమా.

ప్రభాస్ మరియు త్రిష హీరో హీరోయిన్లుగా శోభన్ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో మళ్ళీ రీ రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే "వర్షం" రీ రిలీజ్ అవుతుంది. కాబట్టి సమంత మరియు ప్రభాస్ ల మధ్య తెలుగు రాష్ర్టాల బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ ఏర్పడనుంది.

మరోవైపు యశోద సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా విడుదల కాబోతోంది. అయితే "వర్షం" సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. పైగా బ్లాక్ బస్టర్ సినిమా కాబట్టి బీసీ సెంటర్లలో సినిమా బాగా ఆడే అవకాశం ఉంది. మరోవైపు సమంత సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్లు లేకపోవడం కూడా కొంత మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ సెంటర్లు మరియు మల్టీప్లెక్స్ లో మాత్రం యశోద సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాలలో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News