Pawan-OG: పవన్ #OGలో ప్రభాస్ అపీరియెన్స్.. ఎలా అంటే..?

Pawan-OG: పవన్ #OGలో ప్రభాస్ అపీరియెన్స్.. ఎలా అంటే..?

Update: 2023-04-20 08:49 GMT

Pawan-OG: యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న #OG మూవీ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా మూవీ టీం రోజుకొక సెన్సేషనల్ అప్ డేట్ ఇస్తూ అభిమానులను ఉర్రూతలూపేస్తోంది. #OG హీరోయిన్ గా ప్లాటినం లెగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ను ఫిక్స్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన డైరెక్టర్ సుజిత్ అంతకుమించే రేంజ్ లో ట్విస్ట్ లు ఇస్తున్నాడు.

#OG మూవీలో పవన్ కల్యాణ్ తో పాటుగా ఒక కీలక పాత్ర పోషించేందుకు ఒక పేరున్న హీరో అవసరం పడిందని..ఇంతకు ముందు ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ పాత్ర కోసం నేచురల్ స్టార్ నానితో మూవీ టీం సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో ఈ పాత్ర ఎంతో కీలకం కాబట్టి నాని ఒప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

#OGలో నేచురల్ స్టార్ నాని ఉంటాడని రివీల్ చేసి పవన్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన సుజిత్ అంతకు మించి అన్న రేంజ్ లో మరో బ్రేకింగ్ న్యూస్ ని చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. # OG చిత్రానికి అలాగే ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి లింక్ చేస్తూ ఒక యూనివర్స్ ని సుజిత్ క్రియేట్ చేస్తున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని టాలీవుడ్ ఇన్ సైడర్స్ గుసగసలాడుతున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం..ఇటు పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. అంతేకాదు, టాలీవుడ్ లోకేశ్ కనగరాజ్ అంటూ సుజిత్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Tags:    

Similar News